తెలంగాణ భవన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ 22ఏళ్లను పూర్తి చేసుకొని 23వ వసంతంలోకి అడుగుపెట్టింది. కొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆవిర్భావ వేడుకలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తొలుత తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లికి పూల వేసి వేడుకలను కేసీఆర్ అధికారికంగా ప్రారంభించారు. అనంతరం పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ ప్లీనరీ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా శాఖల అధ్యక్షులతో పాటు మొత్తం 300మంది ప్రతినిధులు హాజరయ్యారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం
బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా అవతరించినా, ఈ ప్లీనరీకి మాత్రం రాష్ట్రానికి చెందిన వారిని మాత్రమే ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రస్తుతం జరుగుతున్న జనరల్ బాడీలో రాజకీయ తీర్మానాలతో సహా భవిష్యత్ కార్యచరణకు సంబంధించని తీర్మానాలను చర్చించి ఆమోదించనున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్ ఆవిర్భావం రోజున ప్లీనరీ నిర్వహించకూడదని పార్టీ నిర్ణయించింది. దీనికి బదులుగా అక్టోబరు 10న వరంగల్‌లో బీఆర్‌ఎస్‌మహా సభ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌వర్కింగ్‌ప్రెసిడెంట్‌కె.టి.రామారావు ప్రకటించారు. తెలంగాణకు రాష్ట్ర సాధన కోసం ఏప్రిల్ 27, 2001న టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముందస్తుగా ఏప్రిల్ 25న నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశాలను నిర్వహించారు.