Page Loader
Hyderabad: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

Hyderabad: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

వ్రాసిన వారు Stalin
Apr 07, 2024
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

షాకులు మీద షాకులు తగుల్తున్న బీఆర్ఎస్ పార్టీకి తాజాగా మరో ఝలక్ తగిలింది. బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం సీఎం రేవంత్​ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​​ లో చేరిపోయారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావు శనివారం తుక్కుగూడలో సభకు కూడా హాజరయ్యారు. రాహుల్ గాంధీ సమక్షంలోనే ఆయన పార్టీలో చేరినప్పటికీ ఆదివారం సీఎం రేవంత్​ ను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనకు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచి బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు ఒక్కరు మాత్రమే గెలిచారు.