Page Loader
Brutal murder: అమెరికాలో భారత సంతతి విద్యార్థిని దారుణ హత్య.. ఆడియో రికార్డింగ్ ద్వారా నిందితుడి గుర్తింపు
అమెరికాలో భారత సంతతి విద్యార్థిని దారుణ హత్య.. ఆడియో రికార్డింగ్ ద్వారా నిందితుడి గుర్తింపు

Brutal murder: అమెరికాలో భారత సంతతి విద్యార్థిని దారుణ హత్య.. ఆడియో రికార్డింగ్ ద్వారా నిందితుడి గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2024
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఓ కళాశాల విద్యార్థిని 46 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 2022లో 34 ఏళ్ల షాన్ లావల్ స్మిత్ అనే వ్యక్తి, 24 ఏళ్ల బ్రియానా కుప్ఫెర్‌ను ఫర్నిచర్ దుకాణంలో వేటాడి హత్య చేశాడు. ఆ సమయంలో, కుప్ఫెర్ తన స్నేహితుడికి సందేశం పంపి, ఆ వ్యక్తి గురించి అసౌకర్యంగా అనిపిస్తోందని చెప్పింది.

Details

బ్రియానా కుప్పెర్ జీవితం విషాదకరంగా ముగిసింది

దాడి జరిగిన 20 నిమిషాల తర్వాత, కుప్ఫెర్ రక్తమడుగులో విగతజీవిలా కనిపించింది. స్మిత్ దాడి చేసిన తర్వాత ఫర్నిచర్ దుకాణం వెనుక తలుపు ద్వారా పారిపోయాడు. కానీ ఘటనాస్థలంలో ఉన్న ఆడియో టేప్, ఫైలెట్ కత్తి, DNA ఆధారాలు పోలీసులకు దొరికాయి. ఈ ఘటనపై కుప్ఫెర్ న్యాయవాది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బ్రియానా కుప్ఫెర్ జీవితం విషాదకరంగా ముగిసిందని మదనపడ్డాడు.