మధ్యప్రదేశ్ అత్యాచారం : ఆటోలో బాలిక రక్తపు మరకలు, సాయం కోసం 8 కి.మీ నడక
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఘోరం జరిగింది. ఈ మేరకు ఓ బాలికపై గ్యాంగ్ రేప్ చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆటోడ్రైవర్ రాకేశ్ (38) సహా ఇతర నిందితులను అరెస్ట్ చేశారు. సదరు ఆటోలో రక్తపు మరకలు ఉన్న దృష్ట్యా ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. బాధితురాలు అర్థనగ్నంగా రక్తమోడుతూ వీధుల్లో సాయం కోసం ఎదురుచూస్తూ, కనిపించిన వారినల్లా వేడుకుంటూ కాలినడకన 8 కిలోమీటర్లు నడిచినట్లు సీసీటీవీ ఫుటేజీ ధ్రువీకరించింది. బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఆటో ఎక్కినట్లు, ఈ మేరకు సీసీటీవీ వీడియో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉన్నా ఆరోగ్య సమ్యసలున్నాయి : పోలీసులు
ఘటన వెలుగులోకి వచ్చే ముందురోజు మైనర్ బాలిక తప్పిపోయినట్లు తమకు ఫిర్యాదు అందిందని సత్నా ఎస్పీ వెల్లడించారు. ఉజ్జయిని వీధిలో రక్తస్రావంతో ఉన్న బాలికను చూసిన ఓ వ్యక్తి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రత్యేక వైద్యుల బృందం బాలికకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉన్నా ఆరోగ్య సమ్యసలున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై మహాకాల్ ఠాణా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని హోంమంత్రి నరోత్తమ్ మిశ్ర పేర్కొన్నారు. రక్తం కారుతున్న బాలిక వీధిలో హాహాకారాలు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.