Drones Seized: పంజాబ్‌లో 16 డ్రోన్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్
పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ సుమారు 16 డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి నవంబర్ 9 నుండి 15 వరకు స్వాధీనం చేసుకున్న డ్రోన్లు. అదనంగా 16 కిలోల మత్తుపదార్థాలను కూడా బీఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ డ్రోన్ల స్మగ్లింగ్ కేసులో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. గతంలో ఒక వారంలో 10 డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈసారి డ్రోన్ల సంఖ్య పెరిగింది. అమృత్‌సర్, తార్న్ తరన్, గురుదాస్‌పూర్ సెక్టార్లలో డ్రోన్లు స్వాధీనం అయ్యాయి.
2023లో 107 డ్రోన్లు స్వాధీనం
2023లో బీఎస్ఎఫ్ 107 డ్రోన్లను స్వాధీనం చేసుకోగా, 2024లో ఇప్పటివరకు 216 డ్రోన్లను రికవరీ చేశారు. ఇది పాకిస్థాన్ భూభాగం నుండి నార్కోటిక్ పదార్థాలు, ఆయుధాలు, నకిలీ కరెన్సీ సరఫరా చేయడంలో ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్ల స్మగ్లింగ్ కేసులు ఒక పక్క భద్రతా సమస్యను రేపితే, మరో పక్క దేశంలో డ్రోన్ టెక్నాలజీని స్మగ్లింగ్‌కి ఉపయోగించడంలో ముప్పును సూచిస్తున్నాయి.