Vijayawada: బుడమేరు గండ్ల పూడ్చివేత.. సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు
భారీ వరదల కారణంగా బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీసీ)కు ఏర్పడిన గండ్లను జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా పూడ్చేశారు. శనివారం మూడో గండిని పూడ్చేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం నిలిచిపోయింది. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చిన అధికారులు, మూడో గండి పూడ్చే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టడం గమనార్హం. ఈ పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో గండ్ల పూడ్చివేత పనులు శరవేగంగా కొనసాగాయి. వరద ఉద్ధృతమైనప్పటికీ, తొలి రెండు గండ్లను వేగంగా పూడ్చే ప్రయత్నాలు జరగాయన్నారు.
సహాయక చర్యలను చేపట్టిన ఆర్మీ జవాన్లు
ముఖ్యంగా ఆర్మీ జవాన్లు కూడా రంగంలోకి దిగి సహాయ చర్యలను చేపట్టారు. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. సీఎం చంద్రబాబు అభినందనలు సమస్యను విజయవంతంగా పరిష్కరించిన జలవనరుల శాఖ అధికారులు, మంత్రులను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. గండ్ల పూడ్చివేతను సకాలంలో పూర్తి చేశారని ఆయన ప్రశంసించారు.