కేంద్ర బడ్జెట్ రూ.48 లక్షల కోట్లు.. రక్షణ రంగానికి అత్యధికం.. వ్యవసాయానికి అత్యల్ప కేటాయింపులు
Budget 2024: పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టారు. మొత్తం రూ.48 లక్షల కోట్లతో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. పేదలు, రైతులు, వ్యాపారులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, మహిళలు, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. పేదలు, యువత, రైతులు, మహిళలు మూల స్థంభాలుగా ఈ మధ్యంతర బడ్జెట్‌ను రూపొందించినట్లు నిర్మల పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు మూలధన వ్యయాన్ని 11 శాతం వృద్ధి చేసి.. రూ.11.11 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. రూ.48లక్షల కోట్ల బడ్జెట్‌లో రక్షణ రంగానికి ఎక్కువ, వ్యవసాయానికి తక్కువ కేటాయింపులు జరిగాయి.
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
రక్షణ మంత్రిత్వ శాఖ: రూ.6.1 లక్షల కోట్లు రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ: రూ.2.78 లక్షల కోట్లు రైల్వే మంత్రిత్వ శాఖ: రూ. 2.55 లక్షల కోట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ: రూ.2.13 లక్షల కోట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ: రూ. 2.03 లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ: రూ. 1.77 లక్షల కోట్లు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ: రూ. 1.68 లక్షల కోట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ: రూ. 1.37 లక్షల కోట్లు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ: 1.27 లక్షల కోట్లు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీ): రూ.86,000 కోట్లు