Lok Sabha: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
నేటి నుంచి పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావనున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు అధికారికంగా మొదలవుతాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనుండగా, తొలి విడత జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆదివారం జరిగే తొలి బడ్జెట్ ప్రవేశపెట్టడం కావడం ప్రత్యేకం. అలాగే, ఇది ఎనిమిదోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భం కూడా అవుతుంది.
వివరాలు
కేంద్రం అఖిలపక్ష సమావేశం
ఈ సమావేశాలు హాట్‌హాట్ వాతావరణంలో జరిగే అవకాశమే కనిపిస్తోంది. గత వర్షాకాల, శీతాకాల సమావేశాలు కొన్ని వివాదాలకు దారి తీసాయి. ముఖ్యంగా, గత శీతాకాల సమావేశాల్లో ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం ''జీ రామ్ జీ''గా మార్చడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈసారి కూడా ఇలాంటి అంశాలు చర్చకు దారితీయే అవకాశం ఉంది. సమావేశాలు సజావుగా జరిగే విధంగా కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. వివిధ పార్టీల నాయకులు కూడా హాజరై, సమన్వయ చర్యలు తీసుకున్నారు.