
Building Collapsed: ఢిల్లీలో రెండంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని కబీర్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలోని ఒక భాగం గురువారం తెల్లవారుజామున 2:16 గంటల ప్రాంతంలో కుప్పకూలింది.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని వార్తా సంస్థ ANI నివేదించింది.
పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు కొనసాగించారు.
గాయపడిన వారిని స్థానిక జీటీబీ ఆస్పత్రికి తరలించగా.. అర్షద్, తౌహీద్ లు చికిత్స పొందుతూ మరణించారు.
రెహాన్, అరుణ్, నిర్మల్, జలధర్ లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
Details
కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న పోలీసులు
భవనం కుప్పకూలిన సమయంలో అందులో 13 మంది కార్మికులు పని చేస్తున్నట్లు డీసీపీ రాజేష్ డియో చెప్పారు.
భవన నిర్మాణానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
భవనం కూలిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఈ విషయమై ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి అనుప్ స్పందించారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించామన్నారు.