Revanth Reddy: యువత, మహిళలకు నైపుణ్య శిక్షణతో టెక్స్‌టైల్ భవిష్యత్తు నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిశ్రమలను ప్రేరేపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే అగ్రగామి టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు. రాష్ట్రం, పారిశ్రామిక రంగంలో భాగస్వామ్యాన్ని కోరుతూ, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారుల కోసం సరికొత్త వాతావరణాన్ని సృష్టించమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) తో కలిసి 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు (ATEXCON2026) ను నిర్వహించింది. సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ATEXCON-2026 నివేదికను విడుదల చేశారు. ఈ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు, జాతీయ-అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్‌ను కూడా సందర్శించారు.
వివరాలు
ముఖ్య అంశాలు ఇవే
తెలంగాణకు చారిత్రక, సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. దేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం, పత్తి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. పోచంపల్లి ఇక్కట్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వంటి సంప్రదాయ వస్త్ర కళలు తెలంగాణ ప్రత్యేకత. తెలంగాణలో డీప్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ వంటి రంగాల్లో ముందంజ. వరంగల్‌లో ఉన్న ప్రపంచ స్థాయి మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో అనేక అప్పరెల్ పార్కులు. తెలంగాణ రైజింగ్ విజన్: 2034నాటికి ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 2047నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం. టెక్స్‌టైల్ పరిశ్రమకు భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతులు, ప్రపంచ పోటీకి అనుగుణమైన విధానాలు అందిస్తున్నాం.
వివరాలు
సినిమా రంగం ద్వారా ఫ్యాషన్ పరిశ్రమను ప్రోత్సహించటం
తెలంగాణ పత్తి ఉత్పత్తి ల్యాండ్ నుండి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులకు సరైన భాగస్వామ్య అవకాశాలు. హైదరాబాద్, సినిమా పరిశ్రమలో దేశానికి కాకుండా ప్రపంచానికి కేంద్రంగా ఎదుగుతోంది. Netflix ఐలైన్ స్టూడియోలను ప్రారంభించటం, హాలీవుడ్ ప్రాజెక్టులు చేరడం. సినిమా రంగం ద్వారా ఫ్యాషన్ పరిశ్రమను ప్రోత్సహించటం. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌ల అభివృద్ధి, యువత మహిళలకు శిక్షణ, ఆధునిక పరికరాలు కలిగిన డిజైన్, కట్టింగ్, స్టిచింగ్ శిక్షణ. తెలంగాణలో తయారైన వస్త్రాలను ప్రపంచంలోని ప్రతి దేశం ధరించేలా చేయాలన్న సంకల్పం. విజయవంతమైన భాగస్వామ్యాన్ని సృష్టిస్తూ సరికొత్త భవిష్యత్తును నిర్మించడం.