
Explained: హర్యానా ఎన్నికల్లో 'బుల్డోజర్' హవా.. ప్రచారానికి కొత్త వ్యూహం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఇటీవల రాజకీయ వాతావరణంలో 'బుల్డోజర్' హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
నిర్మాణ రంగంలో వినియోగించే సాధనం ఇప్పుడు రాజకీయ రంగంలో కీలకమైన ఆయుధంగా మారింది.
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బుల్డోజర్ న్యాయం పేరుతో అక్రమ కూల్చివేతలు చేపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు ప్రచార వాహనంగా జేసీబీలను విస్తృతంగా వినియోగిస్తున్నాయి.
ఇక హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతుండగా జేసీబీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల్లో వీటిని వినియోగిస్తున్నారు.
Details
బుల్డోజర్ కు భలే డిమాండ్
ఇటువంటి ప్రచారంతో పార్టీ కార్యకర్తలు జేసీబీలపై కూర్చొని పూలు చల్లుతూ, నృత్యాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
బుల్డోజర్ చర్యలు ప్రజలలో అనేక ఉత్సాహం రేకెత్తించాయి. ఇది అక్రమార్కుల ఇళ్ల కూల్చివేతకు మాత్రమే పరిమితం కాకుండా, ఎన్నికల్లో ప్రచారానికి ప్రధాన వాహనంగా మారింది.
హర్యానాలో ఎక్కడ చూసినా జేసీబీలు ప్రచారానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రజల క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని పార్టీలు బుల్డోజర్ వాహనాలను విస్తృతంగా వినియోగించడం విశేషం.
బుల్డోజర్ యజమానులు తమ వాహనాలకు భారీ డిమాండ్ ఉందని చెబుతున్నారు.
వాహనాలను దిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి పార్టీలు వినియోగిస్తున్నాయి.