Akhilesh Yadav: 'బుల్డోజర్లు ఇక గ్యారేజీలకే పరిమితం'.. యోగి ప్రభుత్వంపై అఖిలేశ్ విమర్శలు
సుప్రీంకోర్టు బుల్డోజర్ చర్యలపై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం, ఆయన బుల్డోజర్ చర్యలపై మండిపడ్డారు. బుల్డోజర్లు ఇప్పుడు గ్యారేజీలకే పరిమితమవుతాయని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు బుల్డోజర్ చర్యలను వ్యతిరేకిస్తూ తీర్పు ఇచ్చిందని, దీనికి ధన్యవాదాలని చెప్పారు. పేదలకు చెందిన ఏ ఒక్క ఇల్లు ఇక కూలదని కాన్పుర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
20న తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
యూపీలో నవంబర్ 20న తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడం అనేది అన్యాయమని, దీనిని నిరసిస్తూ కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు. జడ్జిలా వ్యవహరించి, నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని ఆయన స్పష్టం చేసింది. ప్రభుత్వాలు, అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.