Page Loader
Bus Catches Fire: హై టెన్షన్ వైరు పడి బస్సు దగ్ధం, పలువురు మృతి 
Bus Catches Fire: హై టెన్షన్ వైరు పడి బస్సు దగ్ధం, పలువురు మృతి

Bus Catches Fire: హై టెన్షన్ వైరు పడి బస్సు దగ్ధం, పలువురు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2024
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మర్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాహర్ ధామ్ సమీపంలో హైటెన్షన్ వైర్ పడిపోవడంతో ప్రయాణికులతో అటు నుండి వెళుతున్న ప్రైవేట్ బస్సులో భారీ మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పలువురు పలువురు ప్రాణాలు కోల్పోయారు. . చాలా మంది గాయపడ్డారు. ఈ బస్సు పెళ్లి వేడుకకు వెళుతుండగా మార్గమధ్యంలో బస్సుపై హైటెన్షన్ వైరు పడి బస్సులో మంటలు చెలరేగాయి. ఘాజీపూర్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాలిపోతున్న బస్సు