Page Loader
రాజస్థాన్‌: దౌసాలో రైల్వే ట్రాక్‌పై బస్సు పడి.. నలుగురు మృతి, పలువురికి గాయాలు 
రాజస్థాన్‌: దౌసాలో రైల్వే ట్రాక్‌పై బస్సు పడి.. నలుగురు మృతి, పలువురికి గాయాలు

రాజస్థాన్‌: దౌసాలో రైల్వే ట్రాక్‌పై బస్సు పడి.. నలుగురు మృతి, పలువురికి గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2023
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఉదయం బస్సు అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. హరిద్వార్ నుంచి ఉదయపూర్ వెళ్తున్నఈ బస్సులో 30 మందికి ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన 28 మందిని చికిత్స నిమ్మితం ఆసుపత్రికి తరలించగా, వారిలో నలుగురు మరణించారు. సంఘటన పై దర్యాప్తు కోసం SDM ను సంఘటనా స్థలానికి పంపామని దౌసాలోని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజ్‌కుమార్ కస్వా తెలిపారు. దౌసా కలెక్టరేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2:15 గంటలకు ఓవర్‌బ్రిడ్జి నుండి దౌసాలోని రైల్వే ట్రాక్‌పై బస్సు అదుపుతప్పి పడిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 రైల్వే ట్రాక్‌పై పడిపోయిన బస్సు