WhatsApp-bus ticket: వాట్సాప్‌లోనే బస్సు టికెట్ల బుకింగ్.. ప్రభుత్వం సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
WhatsApp-based bus ticketing system: వాట్సాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటును అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) వాట్సాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
తాజాగా దేశ రాజధానిలోని బస్సు సర్వీసుల్లో కూడా ఈ సౌకర్యాన్ని అమలు చేసేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
దిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ అయిన DTC, క్లస్టర్ బస్సుల కోసం డిజిటల్ టికెటింగ్ విధానాన్ని ప్రారంభించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు ఓ అధికారి కూడా ధృవీకరించారు.
అయితే వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునే టిక్కెట్లకు పరిమితి విధించే అవకాశం ఉంది.
దిల్లీ
ఒకేసారి గరిష్టంగా 6 టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు
దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇప్పటికే వాట్సాప్ ఆధారిత టికెటింగ్ సేవను విజయవంతంగా అమలు చేస్తోంది. దీని ప్రేరణతోనే బస్సు టికెట్లను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
దిల్లీ మెట్రో టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి ప్రయాణికులు వాట్సాప్‌లో 'హాయ్' అనే సందేశాన్ని +91 9650855800కు పంపాలి.
లేదా నెట్‌వర్క్‌లో తమ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి మెట్రో టిక్కెట్‌లను సులభంగా కొనుగోలు చేయడానికి అందించిన QR కోడ్‌ను స్కాన్ చేయాలి.
దిల్లీ మెట్రో కోసం గరిష్టంగా 6 టిక్కెట్లను ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. మీరు వాట్సాప్‌లోనే QR కోడ్‌తో టిక్కెట్‌ను పొందుతారు.
ఈ టికెట్ బుకింగ్ సదుపాయం అన్ని మెట్రో లైన్లలో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.