TGSRTC: 'హైదరాబాద్ కనెక్ట్' పేరుతో ఆర్టీసీ ప్రణాళిక.. కాలనీలకు బస్సులు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగర పరిధిలో వేగంగా ఏర్పడుతున్న కొత్త కాలనీల ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సేవలను చేరవేయాలనే లక్ష్యంతో ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. 'హైదరాబాద్ కనెక్ట్' పేరుతో ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 373కొత్త కాలనీలకు బస్సు సదుపాయం అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. అధికారులు ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి,రవాణా అవసరం అత్యవసరంగా ఉన్న కాలనీలను గుర్తించారు. రాబోయే రెండు నెలల్లో అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాలకు ప్రథమ దశలో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ రీజియన్‌లోని 243కాలనీలు,సికింద్రాబాద్ రీజియన్‌లోని 130కాలనీలు కలిపి సుమారు 7,61,200మంది ప్రయాణికులకు లాభం చేకూరనున్నట్టు అధికారులు తెలిపారు. హైటెక్‌సిటీ,గచ్చిబౌలి,ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,ఉప్పల్ వంటి ఉద్యోగ కేంద్రాలకు అనుసంధానంగా ఈ సేవలను నడపనున్నారు.
వివరాలు
గుర్తించిన కాలనీలు ఇవే..
హైదరాబాద్ రీజియన్ (డిపోల వారీగా) గుర్తించిన కాలనీలు.. దిల్‌సుఖ్‌నగర్ 55 (అత్యధికం) కాలనీలు, రాజేంద్రనగర్ 51, మిధాని 42, బండ్లగూడ 34, మెహిదీపట్నం 17, ఇబ్రహీంపట్నం 14, హయత్‌నగర్-1లో 12 హయత్‌నగర్-2లో 10, ఫలక్‌నుమా 7, మహేశ్వరం 1 కాలనీ. సికింద్రాబాద్ రీజియన్‌లో.. జీడిమెట్ల 36, చెంగిచెర్ల 25, కూకట్‌పల్లి 21, మేడ్చల్ 10, ఉప్పల్ 10, హెచ్‌సీయూ 8, మియాపూర్-2లో 7, కంటోన్మెంట్ 6, రాణిగంజ్ 4, కుషాయిగూడ 3 కాలనీలు.