చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి భారీ మద్దతు.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
అయితే చంద్రబాబు అరెస్టు కావడం అనేది టీడీపీకి లాభమా? వైసీపీ లాభమా? అనే దానిపై చర్చ జరుగుతోంది.
అయితే చంద్రబాబు అరెస్టు అంశం ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనే దానిపై 'సీ ఓటర్' సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
చంద్రబాబు అరెస్టు కావడం వల్ల 2024 ఎన్నికల్లో టీడీపీకి లాభం చేకూరుతుందని సర్వే వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిణామాలు చంద్రబాబుకు అనుకూలంగా మారినట్లు 56శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారని పేర్కొంది.
సీ
వైసీపీ మద్దతుదారుల్లో 65శాతం మంది టీడీపీకి అనుకూలం
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సీ ఓటర్ సర్వే అన్ని పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకుంది.
చంద్రబాబు జైల్లో ఉండటం వల్ల తమ పార్టీ లాభిస్తుందని 85శాతం టీడీపీ మద్దతుదారలు అభిప్రాయపడ్డారు.
వైసీపీ అభిమానులు మాత్రం 36శాతం మంది మాత్రమే చంద్రబాబు జైలుకు వెళ్లడం జగన్‌కు లబ్ధి చేకూరుతుందని చెప్పడం గమనార్హం.
64శాతం మంది వైసీపీ అభిమానులు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తెలుగుదేశం పార్టీకే ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
బీజేపీ కూడా టీడీపీకే ఇది అనుకూల పరిణామం అని తెలిపింది.
సర్వేలో పాల్కొన్న వారిలో మెజార్టీ ప్రజలు అరెస్టు వల్ల చంద్రబాబుకు భారీగా సింపతీకి పెరిగినట్లు అభిప్రాయపడ్డారు.