8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు గుడ్ న్యూస్.. 8వ వేతన కమిషన్‌కు ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్తను ప్రధాని మోదీ సర్కారు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు కోటి పదిహేను లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతాలు, పెన్షన్ల పెంపుకు మార్గం సుగమం చేయడానికి కేంద్ర కేబినెట్ మంగళవారం 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు చేయడాన్ని ఆమోదించింది. ఈ సంఘానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ దేశాయ్ అధ్యక్షత వహించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం కాలపరిమితి 2026లో ముగియనుంది. దాని అనంతరం కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో 8వ వేతన కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
వివరాలు
సిఫార్సులను పరిశీలించిన అనంతరం.. ప్రభుత్వం కొత్తవేతన సవరణల అమలు
ఆ ప్రకటన అనంతరం పలు కేంద్ర మంత్రులు,మంత్రిత్వ శాఖల అధికారులు,సిబ్బందితో విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి.ఆ సంప్రదింపుల తరువాతే ఈ కొత్త కమిషన్ రూపుదిద్దుకుంది. ఈ 8వ పే కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్‌తో పాటు ఇద్దరు సభ్యులు ఉండనున్నారు. ఈ కమిషన్ తన సిఫార్సులను 18నెలల్లో సమర్పించనున్నట్లు కేంద్రప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. వేతన సంఘం పాత్ర దేశవ్యాప్తంగా సుమారు 50లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు,65లక్షల మంది పింఛనుదారుల వేతనాలు,భత్యాలు నిర్ణయించడంలో వేతన సంఘం కీలక బాధ్యత వహిస్తుంది. ఆసమయంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను,ద్రవ్యోల్బణ రేటు వంటి అంశాలను పరిశీలించి,ప్రస్తుత జీతాలు,పెన్షన్లు ఎంత మేర పెంచాలో కేంద్రప్రభుత్వానికి సూచనలు అందిస్తుంది. ఈసిఫార్సులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం కొత్తవేతన సవరణలను అమలు చేస్తుంది.