Cog: కాగ్ నివేదికలో 'వైసీపీ' ఆర్థిక విధానాలపై ప్రశ్నలు
కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తాజా నివేదికలో వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూపాయిలో 52 పైసలు పన్నుల రూపంలో వచ్చాయని, 30 పైసలు రుణాల ద్వారా సమీకరించామని నివేదిక స్పష్టం చేసింది. అయితే రూపాయిలో స్థానిక సంస్థలకు కేవలం 9 పైసలు మాత్రమే విడుదల చేశారని, మూలధన వ్యయానికి కూడా 9 పైసలు మాత్రమే ఖర్చు చేసినట్లు పేర్కొంది.
శాసనసభ అనుమతి లేకుండా 249 కోట్లు ఖర్చు
ఇక అప్పుల విషయంలో చెల్లించిన మొత్తంలో రూపాయికి కేవలం 7 పైసలే అప్పు చెల్లింపులకు వెచ్చించినట్లు నివేదిక పేర్కొంది. రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.922 కోట్లుగా ఉండగా, శాసనసభ అనుమతి లేకుండా విద్యాశాఖలో రూ.249 కోట్లను ఖర్చు చేసినట్లు కాగ్ ఆరోపించింది. 2023 ఏప్రిల్ నాటికి ఆర్‌బీఐ వద్ద రాష్ట్ర ఖాతాలో రూ.19 కోట్ల లోటు ఉందని కూడా ఈ నివేదికలో వెల్లడించింది.