3 States Elections: ఆ రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఏప్రిల్ 9న పోలింగ్
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. చివరి రోజు అన్ని ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ గురువారం (09-04-2026) జరగనుంది. ఎన్నికల సంఘం సక్రమంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. తొలి విడతలో కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో ఏప్రిల్ 9న ఓటింగ్ జరుగుతుండగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగతాయి.
వివరాలు
మే4న ఫలితాలు
పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ రెండు విడతలుగా జరుగుతోంది: తొలి విడత ఏప్రిల్ 23న, రెండో విడత ఏప్రిల్ 29న జరుగుతుంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ ఏప్రిల్ 29 సాయంత్రం 6 గంటలకు వెల్లడి కానున్నాయి. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఒకే లక్ష్యంతో జోరుగా ప్రచారం కొనసాగించాయి.