కెనడా హై కమిషన్ కీలక ప్రకటన..'భారత్'లో సేవలు కొనసాగిస్తామని, భద్రతా కల్పించాలని అభ్యర్థన
భారతదేశంలోని కెనడా హైకమిషన్ కార్యాలయం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని కెనడా కాన్సులేట్లు తెరిచే ఉంటాయని పేర్కొంది. ఈ క్రమంలోనే ఖాతాదారులకు సేవలు అందిస్తూనే ఉంటామన్నారు. ప్రస్తుతం ఇండియా - కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సందర్భంలో కెనడియన్ దౌత్యవేత్తల భద్రత కోసం భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో కొంతమంది కెనడా దౌత్యవేత్తలకు బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా భారత్ లో తమ సిబ్బందిని తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపింది. వియన్నా ఒప్పందాల మేరకు తాము ఇక్కడ ఉన్నామని, భారతదేశంలో గుర్తింపు పొందిన కెనడా దౌత్యవేత్తలు, కాన్సులేట్ అధికారుల భద్రతకు భారత్ కట్టుబడి ఉండాలని సూచించింది.