
Indian Cyber Force : 2 గంటల పాటు నిలిచిపోయిన కెనడా ఆర్మీ వెబ్‌సైట్.. దర్యాప్తు చేస్తున్నామన్న కెనడా దళాలు
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా దళాలకు చెందిన అన్ని వెబ్‌సైట్ లు బుధవారం సైబర్ అటాక్‌కు గురయ్యాయి. ఈ మేరకు మద్యాహ్నం దాదాపు 2 గంటల పాటు తాత్కాలికంగా సేవలు నిలిచిపోయాయి.
మరోవైపు కెనడా వెబ్‌సైట్ లను తామే హ్యాక్ చేసినట్లు 'ఇండియన్ సైబర్ ఫోర్స్' అనే హ్యాకర్ల బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే సైబర్ అటాక్‌కు బాధ్యత తమదేనని వెల్లడించింది.
కెనడా మిలిటరీ, వైమానిక, అంతరిక్ష సహా ఇతర భద్రతా దళాల అధికారిక వెబ్‌సైట్లు సైబర్ దాడులకు గురవడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
సైబర్ నేరంపై దర్యాప్తును ప్రారంభించామని నేషనల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ మీడియా రిలేషన్స్ హెడ్ డేనియల్ లే బౌథిల్లియర్ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సైబర్ నేరాలపై దర్యాప్తు చేస్తున్నామన్న కెనడా దళాలు
Canadian Airforce Website has been taken down 🔥
— Indian Cyber Force (@CyberForceX) September 27, 2023
>Target - https://t.co/nNzSz3kAHr
>Check host - https://t.co/nH67OaEhMY
Duration: 2 hour#Fuckcanada pic.twitter.com/khfhVQAV2R