KCR: ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. కొత్త పథకాన్ని ప్రకటించిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కొత్త పథకాన్ని ప్రకటించారు. తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి, అధికారంలోకి వస్తే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ జారీలను రద్దు చేస్తామని చెప్పారు. మానకొండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌కు రూ.700, సర్టిఫికెట్ కోసం రూ.500 ఛార్జీ చేస్తున్నారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని మాఫీ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విపరీతంగా డీజిల్ ధరలను పెంచినట్లు కేసీఆర్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.