Page Loader
Amaravati: రూ.లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి.. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం
రూ.లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి.. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం

Amaravati: రూ.లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి.. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 19, 2025
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాజధానిలో రూ.52 వేల కోట్లతో చేపట్టనున్న పనులు, రూ.48 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ప్రధానికి వివరించనున్నారు. తొమ్మిదేళ్ల క్రితం ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని 'నవ నగరాల పనుల ప్రారంభోత్సవ సభ'గా నిర్వహించాలని నిర్ణయించారు.

Details

వాస్తు పరంగా కూడా అనుకూలం

ఈ కార్యక్రమం నిర్వహణ కోసం సచివాలయం వెనుక ఎన్‌-9 రహదారి పక్కన 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధానితో పాటు ఇతర ప్రముఖులు హాజరవనున్న నేపథ్యంలో రవాణాకు అనువుగా ఉండేలా ఈ ప్రాంతాన్ని నిర్ణయించారు. వాస్తు పరంగా కూడా ఇది అనుకూలమని అధికారులు తెలిపారు. రాజధాని పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శాసనసభ భవనంలోని తన ఛాంబర్‌లో పురపాలక మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Details

రాజధాని పనుల పునఃప్రారంభోత్సవంపై సన్మాహాలు

సభ నిర్వహణకు అనువైన ప్రదేశాలపై సీఎం ప్రత్యేకంగా చర్చించారు. ఎన్ని పనులకు ప్రధానితో శంకుస్థాపన చేయించవచ్చన్న అంశంపై సమాలోచనలు చేశారు. రాజధానిలోని మొత్తం ఆరు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం, సచివాలయం వెనుక ఉన్న ప్రదేశం అన్ని విధాలా అనుకూలమని తేలింది. రాజధాని పనుల పునఃప్రారంభోత్సవం ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై సీఎం ముహూర్తంపై చర్చించారు. సమావేశం అనంతరం, సీఆర్డీఏ కమిషనర్‌ కన్నబాబు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. గతంలో ఉద్ధండరాయునిపాలెం వద్ద నిర్మించిన హెలిప్యాడ్లు, సచివాలయం ఎదుట ఉన్న హెలిప్యాడ్లను సభకు వచ్చే ప్రముఖుల రవాణా కోసం వినియోగించాలని నిర్ణయించారు.