
Harish Rawat: కారు ప్రమాదం.. మాజీ సీఎం హరీష్ రావత్‌కు గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కారు మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హరీష్ రావత్ ఛాతీకి గాయమైంది. అలాగే కారులో ఉన్న ఆయన అనుచరులు, సిబ్బందికి కూడా గాయపడ్డారు.
ఉధమ్‌సింగ్ నగర్‌లోని కాశీపూర్‌లో డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, హరీష్ రావత్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్లు, మెరుగైన వైద్యం కోసం కాశీపూర్‌లోని కేవీఆర్ ఆసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. రావత్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. ఈ ప్రమాదంలో రావత్ కారు బాగా డ్యామేజ్ అయిందని పోలీసులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డివైడర్‌ను ఢీకొన్న కారు
Former Uttarakhand CM Harish Rawat's car collides with divider; suffers mild tremorshttps://t.co/2iT6c6BjIf pic.twitter.com/1SJqZmuEYs
— Hindustan Times (@htTweets) October 25, 2023