
Cargo Flight: కార్గో విమానం ఇంజిన్‌లో మంటలు.. చెన్నైలో అత్యవసర ల్యాండింగ్
ఈ వార్తాకథనం ఏంటి
మలేషియాలోని కౌలాలంపూర్ (Kuala Lumpur) నుంచి చెన్నైకి వస్తున్న కార్గో విమానంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి, ముందుగానే చెన్నై విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉండి, విమానం ల్యాండ్ అయిన క్షణంలోనే మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
Details
విమానాల్లో తరుచూ సాంకేతిక లోపాలు
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో విమానాల్లో తరచుగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం తిరువనంతపురం నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలోనూ ఇలాంటి సమస్య తలెత్తింది. ఇంజిన్‌లో లోపాన్ని గుర్తించిన పైలట్, వెంటనే చెన్నైలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (ATC)కు సమాచారం ఇచ్చి, అత్యవసర ల్యాండింగ్ చేశారు. పైలట్ చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.