Page Loader
Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు 

వ్రాసిన వారు Stalin
May 12, 2024
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

నంద్యాలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదంగా మారింది. అయన తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తరపున ప్రచారం చేసేందుకు నంద్యాలకి వెళ్లారు. వైసీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి అల్లు అర్జున్ ను తీసుకువచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రవిచంద్రకిశోర్‌రెడ్డి నివాసం ముందు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. అల్లు అర్జున్, అతని భార్య స్నేహారెడ్డి ,రవిచంద్రకిశోర్‌రెడ్డి నివాసం వెలుపల ఉన్న జనాల వైపు చేతులు ఊపారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

Details 

ఎన్నికల అధికారి అనుమతి లేకుండా నంద్యాలకు అల్లు అర్జున్‌

రిటర్నింగ్‌ అధికారి నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో రవిచంద్ర కిషోర్ రెడ్డి, అల్లు అర్జున్‌లపై శనివారం రెండో పట్టణ పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు ఎన్నికల అధికారి, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పట్టణంలో 30 పోలీసు యాక్టు, 114 సెక్షన్‌ అమల్లో ఉన్నా.. ఎన్నికల అధికారి అనుమతి లేకుండా శిల్పా చంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్‌ వచ్చారని.. అక్కడ వేలమంది గుమిగూడారని చెప్పారు. కాగా, అల్లు అర్జున్ ఈ రోజు హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. మంగళవారం నుండి పుష్ప: ది రూల్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు , మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. పుష్ప: రూల్ ఆగస్టు 15న విడుదల కానుంది.