
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై ఐటీ యాక్టు కింద కేసు నమోదు!
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఐటీ యాక్టుతో పాటు పలు ఇతర సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కి చెందిన అంజనా ప్రియ అనే యువతి.. 2024లో సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబును కించపరిచేలా చేసిన పోస్టులపై ఫిర్యాదు చేసింది.
Details
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టి కొడాలి నానిపై నేరంగా కేసు నమోదు చేశారు. పోలీసులు ఆయనపై భారతీయ న్యాయ విభాగంలోని U/S 353(2), 352, 351(4), 196(1) BNS 467 సెక్షన్లు అలాగే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దీంతో విశాఖ త్రీటౌన్ పోలీస్‌శాఖకు చెందిన అధికారులు గుడివాడలోని కొడాలి నాని నివాసానికి చేరుకొని ఆయనకు 41 సీఆర్పీసీ నోటీసులు అందజేశారు. త్వరలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంతో వైఎస్సార్సీపీలో కలకలం రేగినట్టు కనిపిస్తోంది.