Page Loader
Supreme Court: సీఎం చంద్రబాబుపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం 
చంద్రబాబుపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Supreme Court: సీఎం చంద్రబాబుపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు న్యాయవాది బి. బాలయ్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ పూర్తిగా తప్పు అని అభిప్రాయపడింది. పిటిషన్‌ను సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేసినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇలాంటి పిటిషన్లను మీరు వాదిస్తారా?" అంటూ సీనియర్ న్యాయవాది మణీంద్రసింగ్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరగా సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను పూర్తిగా డిస్మిస్ చేసింది.