Page Loader
YS Jagan: విదేశీ పర్యటనకు వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి
YS Jagan: విదేశీ పర్యటనకు వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి

YS Jagan: విదేశీ పర్యటనకు వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి

వ్రాసిన వారు Stalin
May 14, 2024
06:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి లభించింది. జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. అందుకు అవసరమైన అనుమతిని మంజూరు చేసింది. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా యూకే వెళ్ళడానికి జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా, జగన్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతోందని, అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విదేశాలకు వెళ్ళడానికి జగన్ కి సీబీఐ కోర్టు అనుమతి