తదుపరి వార్తా కథనం

Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సిట్
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 07, 2024
11:27 am
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం(సిట్)విచారణ ప్రారంభించింది.
కల్తీ నెయ్యి గురించి ల్యాబ్ నివేదికలను ఈ బృందం పరిశీలిస్తోంది.ఇప్పటి వరకు ఈ బృందం రెండు సార్లు సమావేశాలు నిర్వహించింది.
సుప్రీం కోర్టు గతంలో ఆదేశించినట్లుగా,సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందం కల్తీ నెయ్యి వాడకంపై విచారించనుంది.
ఈ బృందంలో భాగంగా,సీబీఐ హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఎస్. వీరేశ్‌ప్రభుతో పాటు విశాఖపట్టణంలో ఎస్పీగా పనిచేస్తున్న మురళి.ఆర్‌ను నియమించింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి,విశాఖపట్నం రేంజి డీఐజీ గోపీనాథ్‌జెట్టి సభ్యులుగా నియమితులయ్యారు.
అలాగే,ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నుండి ఒకరిని సభ్యునిగా నామినేట్ చేయాల్సి ఉంది.