NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్
    వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్
    1/3
    భారతదేశం 1 నిమి చదవండి

    వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 08, 2023
    05:17 pm
    వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్
    వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా దారుణ హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఎక్కడా నిందితుడిగా పేర్కొనలేదు. కానీ ఫస్ట్ టైమ్ ఆయన్ను A-8 నేరస్థుడని కోర్టుకు తెలిపింది. తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దర్యాప్తు సంస్థ కౌంటర్ దాఖలు చేసింది. దీంట్లో అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా పేర్కొంటూ జాబితా సిద్ధం చేసింది. హత్యకు కుట్ర, ఆధారాల ధ్వంసంలో ఈ ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరించారని కౌంటర్ లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అతని తండ్రి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే పులివెందులతో పాటు మొత్తం దర్యాప్తు ప్రక్రియనే ప్రభావితం చేయగలరని వివరించింది.

    2/3

    అప్పుడే అతని అనుచరులు వీరంగం సృష్టించారు : సీబీఐ

    అరెస్ట్ చేసినప్పుడే ధర్నాలు చేశారు : సీబీఐ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన క్రమంలో అతని అనుచరులు వీరంగం సృష్టించారని, ధర్నాలు, రాస్తారోకోలు చేశారని కౌంటర్ లో సీబీఐ పేర్కొంది. అలాంటిది ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని స్పష్టం చేసింది. భాస్కర్ రెడ్డి విచారణకు సహకరిస్తున్నట్టే చెబుతారు కానీ అవన్నీ అసత్యాలేనన్నారు. వివేకా మృతదేహానికి పంచనామా వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్, శివశంకర్ రెడ్డిలు హుకుం జారీ చేశారన్నారు. దర్యాప్తు సంస్థ సీబీఐకి సహా న్యాయస్థానానికి ఎలాంటి వివరాలు చెప్పొద్దని దస్తగిరిని సైతం ప్రలోభాలకు గురిచేశారని సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసులో దాగి ఉన్న భారీ కుట్రపై దర్యాప్తు చేసి చేధిస్తామని స్పష్టం చేసింది.

    3/3

    వైఎస్ సునీత ఇంప్లీడ్ పిటిషన్ కు న్యాయమూర్తి అంగీకారం

    ఆరోగ్యం బాగాలేదని, బెయిలివ్వాలని వాదనలు భాస్కర్ రెడ్డి అనారోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని అతని తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ రావు వాదించారు. ఇదే కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఉన్నత న్యాయస్థానం మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను ఆయన ఉదహారించారు. సమాజంలో భాస్కర్ రెడ్డికి మంచి పలుకబడి ఉందని, అంతకుమించి ఓ సీనియర్ సిటిజన్‌ అని వాదించిన న్యాయవాది , ఆయన్ను నేరస్థుడిగా బలపర్చే సాక్ష్యాలు ఎక్కడా లేవన్నారు. మరోవైపు వైఎస్ సునీత దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను న్యాయమూర్తి అంగీకరించారు. ఈ మేరకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    సీబీఐ
    ఆంధ్రప్రదేశ్

    సీబీఐ

    వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ వైఎస్సార్ కడప
    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    వైఎస్‌ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు  హైకోర్టు

    ఆంధ్రప్రదేశ్

    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    ఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ప్రభుత్వం
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం వర్షాకాలం
    తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023