CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి
2023 ఏడాదికి గాను సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు, 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు బోర్డు నిర్వహించింది. దాదాపు 38లక్షల మంది విద్యార్థులు పరీకలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీ కానీ, మే మొదటి వారంలో సీబీఎస్‌ఈ ఫలితాలను బోర్డు ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ 2023కి సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ మూడో వారంలో ముగిసింది.
అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను ఇలా తెలుసుకోవచ్చు
సీబీఎస్ఈ బోర్డు 2023కు సంబంధించిన ఫలితాలను ప్రకటించిన తర్వాత 10, 12వ తరగతి విద్యార్థులు తమ మార్కులను చూసుకోవడానికి బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inని సందర్శించవచ్చు. అలాగే డిజిలాకర్‌లో ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకునేందుకు ఇలా చేయండి. తొలుత అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in హోమ్‌పేజీకి వెళ్లాలి ఫలితాల ట్యాబ్‌పై క్లిక్ చేయాలి తెరపై కొత్త పేజీ కనిపిస్తుంది సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2023' లేదా 'సీబీఎస్ఈ 12తరగతి ఫలితాలు 2023' లింక్‌పై క్లిక్ చేయండి అనంతరం అడిగిన వివరాలను నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి తర్వాత మీ ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి