ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్టు ప్రాథమిక విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగూనంగా ఈ మార్పులను తీసుకొచ్చినట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.
నూతనంగా తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫౌండేషన్ స్జేట్(ఎన్‌సీఎఫ్ఎఫ్ఎస్)ను అమల్లోకి తెస్తున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది.
ఈ నిర్ణయంతో నర్సరీ నుంచి 2వ తరగత వరకు పాఠ్యాంశాల్లో మార్పులు రానున్నాయి. అలాగే మిగత అంశాల్లో కూడా మార్పులు ఉండనున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది.
ప్రాథమిక విద్య
2023-24 విద్యా సంవత్సరం నుంచి అమలు
2023-24 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా తీసుకొచ్చిని మార్పులు అమల్లోకి వస్తాయని సీబీఎస్ఈ తెలిపింది.
అయితే ఈ మార్పుల వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పింది. అలాగే విద్యార్థుల సామర్థ్యాల అంచనా, అభ్యాసన, విధానాలకు సంబంధించి అంశాల్లో ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉందని సీబీఎస్ఈ పేర్కొంది.
విద్యార్థి ప్రవేశ సమయంలో చిన్నారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను రికార్డు చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి.