LOADING...
CBSE: OnMark పోర్టల్‌లో లోపాలపై సీబీఎస్‌ఈ స్పందన.. భద్రతను మరింత పటిష్టం చేస్తామని హామీ
OnMark పోర్టల్‌లో లోపాలపై సీబీఎస్‌ఈ స్పందన.. భద్రతను మరింత పటిష్టం చేస్తామని హామీ

CBSE: OnMark పోర్టల్‌లో లోపాలపై సీబీఎస్‌ఈ స్పందన.. భద్రతను మరింత పటిష్టం చేస్తామని హామీ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌-స్క్రీన్‌ మార్కింగ్‌ (OSM) మూల్యాంకన వ్యవస్థపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) స్పందించింది. ఆన్‌మార్క్‌ పోర్టల్‌లో బయటపడుతున్న సాంకేతిక లోపాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. సీబీఎస్‌ఈ ప్రకారం, ఈ వ్యవస్థ భద్రతను మరింత బలోపేతం చేయడానికి గత కొన్ని రోజులుగా సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల బృందం పనిచేస్తోంది. ఇందులో భారతీయ సాంకేతిక విద్యాసంస్థలు (IITలు)తో పాటు పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన నిపుణులు కూడా భాగస్వాములయ్యారు. వ్యవస్థను మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మార్చేందుకు వారు నిరంతరం కృషి చేస్తున్నట్లు బోర్డు తెలిపింది.

వివరాలు

ఇప్పటికే సంప్రదింపులు జరిపాం

ఇప్పటివరకు గుర్తించిన లోపాలను ఇప్పటికే సరిచేసినట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. అలాగే ఇంకా ఏవైనా భద్రతా లోపాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా నిపుణులు పరిశీలిస్తున్నారని, వాటిని ముందుగానే గుర్తించి నివారించే చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఈ విషయంపై ఎక్స్‌ వేదికగా స్పందించిన సీబీఎస్‌ఈ, వ్యవస్థలోని లోపాలను గుర్తించి తమ దృష్టికి తీసుకొస్తున్న పౌరులు, ఎథికల్‌ హ్యాకర్లకు కృతజ్ఞతలు తెలిపింది. వారిలో కొందరితో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించింది. అదేవిధంగా, ఆన్‌మార్క్‌ పోర్టల్‌కు సంబంధించి ఎవరైనా అదనపు సమాచారం లేదా భద్రతాపరమైన సూచనలు ఇవ్వాలనుకుంటే సీబీఎస్‌ఈ సైబర్‌ భద్రతా విభాగాన్ని సంప్రదించాలని సూచించింది. వ్యవస్థ భద్రత విషయంలో పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని బోర్డు స్పష్టం చేసింది.

Advertisement