CEC chief Rajiv Kumar: ఓటింగ్ డేటా వివాదంపై సిఈసి వివరణకు సుప్రీం ఓకే
ఓటరు ఓటింగ్ డేటా వివాదంపై సుప్రీం కోర్టు అడిగిన వివరణలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ (సిఈసి) రాజీవ్ కుమార్ ఇవాళ తగిన వివరణ ఇచ్చారు. తాను ఇచ్చిన వివరణలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందిందన్నారు. అనవసరమైన సందేహాలను రేకెత్తించటానికి పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. అలాగే ఎలక్ట్రోల్ బాండ్లపై రాబోయే రోజుల్లో పారదర్శకమైన చర్చకు మార్గం సుగమం చేస్తానని హామీ ఇచ్చారు. ఇది దేశ సమగ్రతకు మచ్చ తేకుండా చిత్తశుద్దితో కృషి చేస్తామని సిఈసి విస్పష్టమైన హామీనిచ్చారు.
ఎలక్ట్రోల్ బాండ్లపై త్వరలో పారదర్శకమైన చర్చ
ఎలక్ట్రోల్ బాండ్లపై తలెత్తిన వివాదాలన్నింటికీ ఏదో ఒక రోజు తగిన సమాధానమిస్తానని ధీమాగా చెప్పారు. ఈ అంశంపై వివరణాత్మక చర్చజరిగేలా చూస్తామన్నారు.అలాగే EVM ల పని తీరుపై ప్రజల్లో సందేహాలు తలెత్తెలా కొందరు ప్రయత్నించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఓటర్ల జాబితాలో అవతవకలపై ఇదే రకమైన ప్రచారం చేశారన్నారు. పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయో వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ దీపాంకర్ దత్తా,సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మధ్యంత ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ మధ్యంతర పిటిషన్ 2019 ప్రధాన రిట్ పిటిషన్‌లోని సమానంగా ఉన్నాయని బెంచ్ పేర్కొంది.