Loading...
CEC Gyanesh Kumar: 'SIR' నిరసనల వేళ సీఈసీ జ్ఞానేష్ కుమార్కు జెడ్ ప్లస్ భద్రత 
'SIR' నిరసనల వేళ సీఈసీ జ్ఞానేష్ కుమార్కు జెడ్ ప్లస్ భద్రత

CEC Gyanesh Kumar: 'SIR' నిరసనల వేళ సీఈసీ జ్ఞానేష్ కుమార్కు జెడ్ ప్లస్ భద్రత 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

'SIR'పై దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు, నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ భద్రతను మరింత పెంచారు. ఇప్పటికే ఆయనకు జెడ్‌ ప్లస్‌ భద్రత ఉండగా.. తాజాగా అందిన ముప్పు అంచనా సమాచారం ఆధారంగా అదనపు భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. నివాసం,ఈసీ కార్యాలయం వద్ద అదనపు బలగాలు జ్ఞానేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యూఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంతో పాటు అశోకా రోడ్డులో ఉన్న ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం 'నిర్వాచన్ సదన్' వద్ద అదనపు పోలీసు,పారామిలటరీ బలగాలను మోహరించారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా పెంచారు.

వివరాలు 

'SIR'పై కొనసాగుతున్న నిరసనలు

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, పలు ప్రజాస్వామ్య వేదికలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అక్టోబర్‌ 5న ఢిల్లీలో జరిగిన భారీ నిరసనల నేపథ్యంలో సెంట్రల్‌ ఢిల్లీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు.

అనంతరం అక్టోబర్‌ 6న రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు 'ఇండియా' కూటమికి చెందిన పలువురు ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీ నిర్వహించారు.

వివరాలు 

'SIR'పై కొనసాగుతున్న నిరసనలు

పోలీసులు వారిని అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

అక్టోబర్‌ 7న కూడా ఢిల్లీలో నిరసనలు, నేతల అదుపులోకి తీసుకోవడం కొనసాగింది.

మరోవైపు, SIR ప్రక్రియ ఉద్దేశం ఓటర్ల జాబితాలను మరింత శుద్ధి చేయడమేనని ఎన్నికల సంఘం చెబుతోంది.

నకిలీ, డూప్లికేట్‌, అనర్హమైన ఓటర్ల వివరాలను తొలగించేందుకే ఈ సవరణ చేపట్టినట్లు స్పష్టం చేస్తోంది.

ప్రతిపక్షాల ఆరోపణలను ఎన్నికల సంఘం, కేంద్రంలోని అధికార పక్షం ఖండిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

సుప్రీంకోర్టులోనూ విచారణ

SIR వివాదం, ఎన్నికల సంఘం నిర్ణయాలపై వచ్చిన ఆరోపణలు సుప్రీంకోర్టుకు చేరాయి.

ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే సీఈసీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు.

SIRకు సంబంధించిన 14 కీలక నిర్ణయాల విషయంలో ఇతర ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తదితరులకు నోటీసులు జారీ చేసింది.

అయితే జ్ఞానేష్ కుమార్‌ను తక్షణం సస్పెండ్ చేయాలన్న మధ్యంతర అభ్యర్థనను మాత్రం కోర్టు తిరస్కరించింది.

ముందుగా సంబంధిత పక్షాల నుంచి సమాధానాలు తీసుకుని, అధికారిక రికార్డులను పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

సుప్రీంకోర్టులోనూ విచారణ

చట్టానికి విరుద్ధంగా లేదా అవసరమైన ఏకాభిప్రాయం, మెజారిటీ లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్లు రికార్డుల పరిశీలనలో తేలితే.. అలాంటి నిర్ణయాలను రద్దు చేసే అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ADVERTISEMENT