
Jamili elections: జమిలి ఎన్నికల బిల్లుల గురించి కేంద్రం పునరాలోచన!
ఈ వార్తాకథనం ఏంటి
జమిలి ఎన్నికల బిల్లులపై కేంద్రం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే ఈ నెల 16న లోక్‌సభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం ఉంది.
ఇప్పుడు ఈ జాబితాలో నుంచి ఈ బిల్లులను తొలగించింది. మొదటగా, ఈ బిల్లులను లోక్‌సభ బిజినెస్‌లో భాగంగా ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.
కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ బిల్లును ముందుకు తీసుకురావాలని పేర్కొన్నప్పటికీ, తాజా లోక్‌సభ బిజినెస్‌లో ఈ బిల్లులు మిస్టరీగా మారాయి.
Details
జమిలి ఎన్నికల బిల్లుపై సందిగ్ధత
ఈ నెల 20తో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టడం గురించి సందిగ్ధత నెలకొంది.
జమిలి ఎన్నికలు అమలు కోసం రాజ్యాంగంలో కీలకమైన 82ఎ, 83, 172, 327 వంటి అధికరణాలను సవరించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.
ఈ చర్యలు తీసుకోకపోతే, రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయాలు సర్దుబాటు చేయడం కష్టంగా మారుతుంది.