Central Team: నేడు ఏపీలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాలో బుధవారం, గురువారం కేంద్ర బృందం(Central Team) పర్యటించనుంది. తుపాన్‌తో నష్టపోయిన పంటలను, ఇతర ఆస్తుల నష్టాన్ని అంచనా వేయనున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మెనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఇవాళ కృష్ణా, బాపట్ల జిల్లాలో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాలో పర్యటించనుంది. రెండు రోజుల రాష్ట్రంలో జరిగే ఈ పర్యటనలో ముందుగా కేంద్రం బృందం డిజాస్టర్ మెనేజ్‌మెంట్ డైరక్టరుతో భేటీ కానుంది. రెండు బృందాలుగా ఏర్పడి ప్రభావిత ప్రాంతాలను బృంద సభ్యులు పరిశీలించనున్నారు.
తుఫాన్ నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్రం బృందం
క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు తుపాన్ జరిగిన నష్టంపై ఆయా జిల్లాల అధికారుల నుంచి సెంట్రల్ టీమ్ నుంచి సమాచారం సేకరించనుంది. మరోవైపు కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఇవాళ, రేపు కేంద్ర బృందం పర్యటించనుంది. మిచౌంగ్ తుఫాన్ కారణంగా వేలాది ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారు. ఆయా జిల్లాల అధికారుల నుంచి సంబంధితా సమాచారన్ని సేకరిస్తారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ పేర్కొన్నాడు.