Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం
ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్,తెలంగాణలపై ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈరోజు కేంద్ర బృందం ప్రకాశం బ్యారేజీ పరిస్థితులను సమీక్షించింది. జలవనరుల శాఖ అధికారులు, బ్యారేజీకి సంబంధించిన నీటి ప్రవాహం, ఇతర ముఖ్య విషయాలను కేంద్ర బృందానికి వివరించారు. ఈఎస్‌సీ వెంకటేశ్వర్లు, ఈ నెల 1న 11.43 లక్షల క్యూసెక్కుల వరద రికార్డు స్థాయిలో వచ్చిందని తెలిపారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పరిస్థితి, ముంపు సమస్యలపై కూడా కేంద్ర బృందం అవగాహన పొందింది.