Page Loader
Central Tribal University: ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం 
ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

Central Tribal University: ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం 

వ్రాసిన వారు Stalin
Oct 04, 2023
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1వ తేదీన మహబూబ్ నగర్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ములుగు జిల్లాలో గిరిజన యువత కోసం కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మోదీ ఇచ్చిన హామీ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీని దాదాపు రూ.900కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ యూనివర్సిటీకీ గిరిజను ఆరాధ్య దేవతలైన సమ్మక్క, సారక్క పేర్లను పెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేంద్రం తీసుకుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో బీజేపీ పొలిటికల్ మైలేజ్‌ను పెంచే అవకాశం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రూ.900కోట్లతో యూనివర్సిటీ నిర్మాణం