NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / '1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్': 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' ప్రకటించిన కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    '1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్': 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' ప్రకటించిన కేంద్రం
    'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' ప్రకటించిన కేంద్రం

    '1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్': 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' ప్రకటించిన కేంద్రం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 29, 2024
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేసే 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన'కు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గురువారం తెలిపారు.

    ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన'కు ఈరోజు ఆమోదం లభించిందని,ఈ పథకం కింద కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుందని ఠాకూర్ చెప్పారు.

    కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఠాకూర్, రూఫ్‌టాప్ సోలార్‌ను అమర్చడంతోపాటు కోటి కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకానికి ఆమోదం తెలిపినట్లు తెలిపారు.

    Details 

    కేంద్ర ప్రభుత్వ భవనాలపై ప్రాధాన్యత ప్రాతిపదికన రూఫ్‌టాప్ సోలార్‌

    PTI ప్రకారం,ప్రతి కుటుంబం 1 kw సిస్టమ్‌కు రూ.30,000,2 kw సిస్టమ్‌కు రూ.60,000 సబ్సిడీని పొందవచ్చు.

    2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ భవనాలపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ఠాకూర్ తెలిపారు.

    2025 నాటికి,అన్ని కేంద్ర ప్రభుత్వ భవనాలపై ప్రాధాన్యత ప్రాతిపదికన రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

    ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని,ఐదేళ్ల కాలానికి రూ.150 కోట్ల వన్-టైమ్ బడ్జెట్ సపోర్టును అందజేస్తుందని ఆయన తెలిపారు.

    "భారతదేశంలో ప్రధాన కార్యాలయంతో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్(ఐబిసిఎ)స్థాపనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

    2027-28వరకు ఐదేళ్ల కాలానికి రూ.150 కోట్ల వన్-టైమ్ బడ్జెట్ మద్దతును కూడా ఆమోదించింది," అయన తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మాట్లాడుతున్న కేంద్ర మంత్రి 

    #WATCH | Union Minister Anurag Thakur says, "By 2025, rooftop solar will be installed on all central government buildings on a priority basis..." pic.twitter.com/F3K9ilb2nd

    — ANI (@ANI) February 29, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అనురాగ్ సింగ్ ఠాకూర్

    తాజా

    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్

    అనురాగ్ సింగ్ ఠాకూర్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ రెజ్లింగ్
    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్ రెజ్లింగ్
    వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు గ్యాస్
    రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్  రెజ్లింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025