LOADING...
Telangana: పీఎం శ్రీ స్కూళ్ల అమలుపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్రం నోడల్‌ అధికారులు
పీఎం శ్రీ స్కూళ్ల అమలుపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్రం నోడల్‌ అధికారులు

Telangana: పీఎం శ్రీ స్కూళ్ల అమలుపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్రం నోడల్‌ అధికారులు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రాల్లో అమలులో ఉన్న పీఎం శ్రీ పాఠశాలల పథకం అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులను ప్రత్యేక నోడల్‌ అధికారులుగా నియమించింది. తెలంగాణకు సంబంధించి జిల్లాల వారీగా అధికారులు నియమితులయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఫరీదా మహమ్మద్‌నాయక్, రంగారెడ్డి జిల్లాకు శివ్‌రతన్, నల్గొండకు కమలేష్‌కుమార్‌ మిశ్ర, ఖమ్మం జిల్లాకు ఏక్తా విష్ణోయ్, రాజన్న సిరిసిల్లకు ప్రవీర్‌కుమార్, సంగారెడ్డికి అమన్‌శర్మ, నిజామాబాద్‌కు దేవేంద్రకుమార్‌ రాయ్, కుమురంభీం ఆసిఫాబాద్‌కు ఆధర్‌రాజ్, సిద్దిపేట జిల్లాకు శైలేంద్రకుమార్, కరీంనగర్‌కు సుమంత్‌నారాయణ్‌లను నోడల్‌ అధికారులుగా నియమించారు.

వివరాలు 

137 మంది నోడల్‌ అధికారులను నియమించిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద మొత్తం 794 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 82 ప్రాథమిక పాఠశాలలు,30 ఎలిమెంటరీ స్కూళ్లు,472 మాధ్యమిక పాఠశాలలు,210 మాధ్యమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌ 31న పీఎం శ్రీ పథకం అమలుపై నిర్వహించిన ప్రగతి సమీక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పథకం అమలు పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖల్లో సంయుక్త కార్యదర్శులుగా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించి,క్షేత్రస్థాయిలో పాఠశాలలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం మేరకు తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల జిల్లాలకు కలిపి మొత్తం 137 మంది నోడల్‌ అధికారులను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

Advertisement