LOADING...
Andhra Pradesh: పీఎంజీఎస్‌వై కింద రూ.422 కోట్లతో రోడ్లు, వంతెనలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
పీఎంజీఎస్‌వై కింద రూ.422 కోట్లతో రోడ్లు, వంతెనలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

Andhra Pradesh: పీఎంజీఎస్‌వై కింద రూ.422 కోట్లతో రోడ్లు, వంతెనలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2026
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్'లో చేపట్టనున్న రహదారులు, వంతెనల నిర్మాణ పనులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.422.10 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.338.59 కోట్లతో 347.38 కిలోమీటర్ల పొడవున 146 గ్రామీణ రహదారులను నిర్మించనుండగా, రూ.83.51 కోట్లతో 19 వంతెనల నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను దిల్లీలో గురువారం జరిగిన కేంద్ర ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో పరిశీలించి ఆమోదించారు.

వివరాలు 

పెరగనున్న ప్రయాణ సౌలభ్యం

100, 200, 500 జనాభా కలిగిన గ్రామాలను సమీప ప్రధాన రహదారులతో అనుసంధానించే లక్ష్యంతో ఈ రహదారి పనులను చేపట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు ప్రయాణ సౌలభ్యం పెరగనుంది. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను అందించనుండగా, మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. దిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) బాలు నాయక్ పాల్గొని రాష్ట్ర ప్రతిపాదనలను వివరించారు.

Advertisement