Telangana: అమృత్ 2.0 కింద తెలంగాణలో 252 ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 30, 2026
12:31 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమృత్ 2.0 పథకం కింద తెలంగాణలో రూ.9,584 కోట్ల విలువ ఉన్న 252 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి టోకన్ సాహు తెలిపారు. గురువారం లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఈటల రాజేందర్ ల ప్రశ్నకు సమాధానం చెప్పిన ఆయన, ఇందులో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే 3 సీవేజ్/సెప్టేజ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు రూ.3,949.10 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ మొత్తం ప్రాజెక్టులకు కేంద్ర వాటా రూ.2,788.03 కోట్లు ఉంటుంది'' అని సహాయమంత్రి వివరించారు.