Islamic Research Foundation: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐఆర్‌ఎఫ్‌పై మరో ఐదేళ్లు నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ జాకీర్ నాయక్ స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (IRF)పై విధించిన నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించింది. ఈ మేరకు గురువారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా, శాంతిభద్రతలకు, మత సామరస్యానికి విఘాతం కలిగించేలా సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయని కేంద్రం పేర్కొంది. ఈ నెల 14తో గతంలో విధించిన నిషేధ గడువు ముగియనుండటంతో, ముందుగానే పొడిగింపు నిర్ణయం తీసుకుంది.
వివరాలు
మత విద్వేషాలను రెచ్చగొడుతున్నట్లు ఆరోపణలు
డాక్టర్ జాకీర్ నాయక్ స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ తన అనుచరులను మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రోత్సహిస్తోందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
ఐఆర్‌ఎఫ్ అధిపతి చేసిన అభ్యంతరకర ప్రసంగాలతో పాటు సోషల్ మీడియా,అంతర్జాతీయ టెలివిజన్ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రచారం చేస్తున్న కఠినవాద భావజాలం దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పుగా మారాయని పేర్కొంది.
సంస్థ కార్యకలాపాలను వెంటనే నియంత్రించకపోతే, విద్వేషపూరిత చర్యలు కొనసాగించే ప్రమాదం ఉందని కేంద్రం అభిప్రాయపడింది.
వివరాలు
మత విద్వేషాలను రెచ్చగొడుతున్నట్లు ఆరోపణలు
అంతేకాకుండా, ప్రస్తుతం పరారీలో ఉన్న సంస్థ కార్యకర్తలను తిరిగి సమీకరించి దేశంలో మతపరమైన అశాంతిని సృష్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం-1967లోని సెక్షన్ 3 ప్రకారం ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై మరో ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.
ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ రాఠీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జాకీర్ నాయక్ సంస్థపై మరో ఐదేళ్లు నిషేధం విధించిన కేంద్రం
Centre extends ban on Zakir Naik's Islamic Research Foundation for another 5 years
— NewsDrum (@thenewsdrum) November 13, 2026
READ | https://t.co/ele7NDvrTd#ZakirNaik #IRF #HomeMinistry #IslamicResearchFoundation #UAPA pic.twitter.com/vSmanYpKue