LOADING...
Sanchar Saathi App: సంచార్‌ సాథీ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్‌ చేయడం తప్పనిసరేం కాదు: కేంద్రం  
సంచార్‌ సాథీ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్‌ చేయడం తప్పనిసరేం కాదు: కేంద్రం

Sanchar Saathi App: సంచార్‌ సాథీ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్‌ చేయడం తప్పనిసరేం కాదు: కేంద్రం  

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం తెలిపినట్లుగా, కొత్తగా విడుదలయ్యే సెల్‌ఫోన్లలో సంచార్ సాథీ (Sanchar Saathi) యాప్‌ను ముందుగా ఇన్‌స్టాల్ చేయించడం తప్పనిసరి కాదు. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు టెలికాం విభాగం బుధవారం ప్రకటించింది. మొదట కేంద్రం, సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం కొత్త ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరి చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనిని వ్యక్తిగత జీవితాల్లో అంతరాయం కలిగించే ప్రయత్నంగా విపక్షాలు చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరితో కూడా సంప్రదించకుండా,నియంతృత్వంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి.

వివరాలు 

ఇదే తమ అసలు ఉద్దేశం: కేంద్రం 

కేంద్ర ఆదేశాల తర్వాత, స్వచ్ఛందంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్రం తాజాగా తెలిపిన ప్రకటనలో, ఇదే తమ అసలు ఉద్దేశం అని పేర్కొంది. "సంచార్ సాథీ యాప్ వినియోగదారులు వేగంగా పెరుగుతున్నారు. తప్పనిసరి చేయడంలో ఉన్న ఉద్దేశ్యం కూడా ఇదే - ఇంకా తెలియని వారికి ఈ యాప్ గురించి అవగాహన కల్పించడం. గడిచిన ఒక్కరోజులోనే ఆరు లక్షల మందికి యాప్‌లో రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది దాదాపు పదింతల పెరుగుదల. ఈ నేపథ్యంలో, ముందుగానే యాప్ ఇన్‌స్టాల్ చేయించాల్సిన అవసరం లేదు" అని టెలికాం విభాగం వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

PIB ఇండియా చేసిన ట్వీట్ 

Advertisement