Page Loader
డిజిటల్ మోసాలపై కేంద్రం సీరియస్.. ఓటీటీలు జర భద్రం, బెట్టింగ్ ప్రకటనలపై నిఘా
ఓటీటీలు జర భద్రం, బెట్టింగ్ ప్రకటనలపై నిఘా

డిజిటల్ మోసాలపై కేంద్రం సీరియస్.. ఓటీటీలు జర భద్రం, బెట్టింగ్ ప్రకటనలపై నిఘా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 19, 2023
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోజు రోజుకూ డిజిటల్ మోసాలు పేట్రేగిపోతున్నాయి. వివిధ సామాజిక మధ్యమాలు, ఓటిటి ప్లాట్ ఫామ్స్ ప్రవేశించిన తర్వాత మోసపూరిత ప్రకటనలు భారీగా పెరగడం ఆందోళనకరం. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది యువత మోసపోతున్నారు. ఫలితంగా ఆర్థికంగా కుదేలవుతున్నారు. పలు ఫేక్ మార్కెటింగ్ తో యూజర్స్ ముప్పుతిప్పలకు గురవుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా అడల్డ్ కంటెంట్ తో చిన్నారులను పెడదారి పట్టిస్తున్నారు. తాజాగా ఈ డిజిటల్ మోసాలపై కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లడంతో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు భద్రతా రీత్యా ఈ ప్రకటనలపై భారీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.దీంతో కేంద్రప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

DETAILS

బెట్టింగ్‌ ప్రచార వీడియోలను ప్రసారం చేయవద్దని కేంద్రం హెచ్చరిక 

ఈ క్రమంలో బహుళ ఏజెన్సీలు, మంత్రిత్వశాఖలతో ఇటీవలే ఓ భేటీ జరగ్గా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అసభ్యకరమైన ప్రకటనలను చూపించొద్దని ఛానెళ్లకు, ఓటిటిలకు సూచించింది. ఇప్పటికే ఆయా కంటెంట్ పై నిషేధాలున్నా పలు ఓటీటీలు కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రసారం చేస్తున్నట్లు ఓ సీనియర్ ఉన్నతాధికారి వెల్లడించారు. గతేడాది ఓటీటీలు నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ వంటి స్ట్రీమింగ్ సేవల్లో బెట్టింగ్‌ ప్రచార వీడియోలను ప్రసారం చేయవద్దని హెచ్చరించింది. అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా పలు ప్రకటనలను ఓటిటి ప్లాట్‌ ఫామ్స్ గుప్పిస్తున్నట్లు తేలింది.

DETAILS

సున్నితమైన సమాచారం మార్పిడితో వ్యక్తిగత భద్రతకు ముప్పు

2018 నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ కు సంబంధించి కేంద్ర హోంశాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (I4C)కు దాదాపు 8 వేల కంటే ఎక్కువ ఫిర్యాదులే అందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని సంస్థలు తమ వీడియోల్లో ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్నాయని అధికార యంత్రాంగం గుర్తించింది. పలు ఓటిటి ప్లాట్‌ఫామ్స్ ప్లేయర్ వెరిఫికేషన్ ముసుగులో ఆటగాళ్ల నుంచి సున్నితమైన సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్యాంక్ ఖాతా నంబర్లు, ఆధార్ నంబర్, పాన్ నంబర్ వంటి వ్యక్తిగతమైన వివరాలను అడుగుతున్నట్లు తేలింది. ఫలితంగా వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు కేంద్ర ఏజెన్సీలు వెల్లడించాయి. హవాలా, క్రిప్టోకరెన్సీల ద్వారా భారత ఆర్థిక భద్రతకే ముప్పు వాటిల్లనుంది.