తదుపరి వార్తా కథనం

Champai Soren : బీజేపీలోకి చేరడం లేదు.. క్లారిటీ ఇచ్చేసిన ఝార్ఖండ్ సీఎం చంపై సోరెన్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 18, 2024
01:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు వేడక్కాయి.
ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) నేత చంపై సోరెన్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి దిల్లీకి చేరుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. తాజాగా ఈ వ్యాఖ్యలపై చంపై సోరెన్ స్పందించారు.
తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
Details
పిల్లలను కలిసేందుకు దిల్లీకి వచ్చా
దిల్లీలో తాను ఎవరిని కలవలేదని, వ్యక్తిగత పనితో భాగంగా తన పిల్లలను కలిసేందుకు దిల్లీకి వచ్చానని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం ఎక్కడ ఉన్నానో అక్కడే జీవితాంతం ఉంటానని చంపై సోరెన్ వ్యాఖ్యనించారు.
మరోవైపు చంపై పార్టీ మారితే తప్పేంటి అని బీజేపీ ఎంపీ దీపక్ ప్రకాశ్ పేర్కొన్నారు.