
Grenade Blast: చండీగఢ్ పేలుడు ఘటన ఖలిస్తానీ ఉగ్రవాదుల ప్రమేయం?
ఈ వార్తాకథనం ఏంటి
చండీగఢ్‌లోని సెక్టార్ 10లో జరిగిన గ్రెనేడ్ పేలుడు కేసు కలకలం రేపుతోంది.
రిటైర్డ్ పోలీసు అధికారి ఇంట్లో బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదకర ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ పేలుడు వల్ల ఇంటి కిటికీలు, పూల కుండీలు దెబ్బతిన్నాయని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే, పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.
పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు రూ. 2 లక్షల రివార్డు ప్రకటించారు. పేలుడుకు ముందు ముగ్గురు వ్యక్తులు ఆటోరిక్షాలో ఘటన స్థలానికి చేరుకున్నారని వర్గాలు తెలిపాయి.
Details
నిందితుల కోసం గాలింపు
పేలుడు శబ్ధం చాలామందికి దూరం నుంచే వినిపించిందని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ దాడికి ముందు, నిందితులు రెండు రోజుల పాటు ఇంటిని నిఘా పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పేలుడు అనంతరం, చండీగఢ్ పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ముఠా కార్యకలాపాలు ఈ దాడికి కారణమని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
పాకిస్తాన్‌లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది రిండా ఈ గ్రెనేడ్ దాడికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు.